ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సూపర్ సిక్స్ పథకాలలో తల్లికి వందనం పథకం ప్రత్యేకమైనది, అందుకే ఇది చాలా ముఖ్యమైన పథకం, తల్లికి వందనం పథకానికి అర్హులు కావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో 1వి తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు అర్హులు,
తల్లికి వందనం పథకం కింద ప్రతి ఒక్క విద్యార్థికి వచ్చే ఆర్థిక సహాయం ఎంత?
ఈ తల్లికి వందన పథకం కింద పాఠశాలలో చదివే ప్రతి ఒక్క విద్యార్థికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15 వేల రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది, ఈ 15 వేల రూపాయలలో 2 వేల రూపాయలు పాఠశాల నిర్వహణ ఖర్చుల కింద పాఠశాలకు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక విద్యార్థికి ఇచే ఆర్థిక సహాయం మొత్తం 13వేల రూపాయలు, ఐతే ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సహాయం నేరుగా తల్లుల ఖాతాలో వేయడం జరుగుతుంది, అదే విధంగా ప్రభుత్వం ఈ ఆర్ధిక సహాయము ఒక ఇంట్లో చదివే విద్యార్థులు ఎంత మంది ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి 13 వేల పాయల చొప్పున ఇవ్వటం జరుగుతుంది.
ఏపీ ప్రభుత్వం ఏ రోజున ఈ ఆర్థిక సహాయని అందించబోతుంది?
ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం, అధికారులు మాట్లాడుతూ జూలై 3 వ, వారంలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది అని తెలిపారు. ఇంక అధికారులు ఏమన్నారంటే తల్లుల డేటా బేస్ మరియు Aadhaar వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది, ఆది పూర్తయిన తర్వాత తల్లికి వందనం పథకాని అధికారికంగా ప్రారంభించి తల్లుల ఖాతాలో నేరుగా డబ్బులు జమ చేయడం జరుగుతుంది. గత ఏడాది సుమారు 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది.
ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందాలంటే ఇవి తప్పనిసరి పాటించాల్సిందే.
తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే విద్యార్థుల తల్లులు వాళ్ళ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండడం తప్పనిసరి.
ఆధార్ అనుసంధానం కాకపోయినా లేదా e-KYC పెండింగ్‌లో ఉన్న డబ్బులు నిలిచిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి ఒకసారి మీ అకౌంట్ ఉన్న బ్యాంకుకు వెళ్ళి చెక్ చేసుకుంటే మంచిది.
తల్లికి వందనం లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకునే విధానం (తల్లికి వందనం Eligible List – 2026)
ఆఫ్‌లైన్ (offline ) పద్ధతిలో తెలుసుకునే విధానం :
ముందు గ్రామ వార్డు సచివాలయనికి వెళ్ళి అక్కడ పోస్టర్ రూపంలో బయట జాబితా లిస్ట్ అతికించడం జరుగుతుంది. ఆ జాబితాలో మీ పిల్లల పేర్లు మరియు మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి.
ఆన్లైన్ (online ) పద్ధతిలో తెలుసుకునే విధానం :
1. నవశకం బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అధికారిక పోర్టల్ ను ఓపెన్ చేయండి.
2. ఆ తర్వాత హోమ్ పేజీలో ఉన్న Talliki vandanam Eligibility Status అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

3. మొదట బాక్స్ లో ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి, తర్వాతి బాక్స్ లో talliki Vandanam అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి, ఆ తర్వాత ఇయర్ 2026-27 సెలెక్ట్ చేసి, Get Details ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
4. అక్కడ గ్రీన్ కలర్లో “Satisfied” వస్తే మీరు అర్హత పొందినట్టు, Un Satisfied అని వస్తే ఏదో సమస్య ఉందని అర్ధం.
డబ్బులు మీ అకౌంట్ లోకి పడకపోతే ఏమి చేయాలి?
ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా మీ అకౌంట్ లోకి డబ్బులు జమ కావాలంటే ఈ క్రింది పద్ధతుల పాటించండి.
1.Pancard Link In Account :
మీ యొక్క బ్యాంక్ ఖాతా కు పాన్ కార్డు లింక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి లేదంటే నగదు బదిలీ విషయంలో సమస్యలు రావచ్చు ఒక్కొక్కసారి ఓల్డ్ లో (hold) కూడా పడవచ్చు.
2.Aadhaar Link in Bank Account :
మీ బ్యాంక్ అకౌంట్ కూడా ఆధార్ తప్పనిసరిగా లింక్ అయ్యి ఉండాలి లేదంటే ప్రభుత్వం పథకాలకు సంబంధించిన డబ్బులు అకౌంట్లోకి పడవు.
3. E-KYC Update : ఉదాహరణకు మీది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ అయితే మీరు తప్పనిసరిగా ఈ యొక్క e-kyc చేసుకునే ఉండాలి, ఈ కేవైసీ ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉండాలి.
4.NPCI Mapping & Aadhaar Seeding : NPCI అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని అర్థం, ఇది చాలా ముఖ్యమైనది ప్రభుత్వ పథకాలు మరియు సబ్సిడీలు పొందటానికి కచ్చితంగా NPCI మ్యాపింగ్ మీ అకౌంట్ కి అయి ఉండాలి, ఒకసారి మీ బ్యాంకు కి వెళ్లి NPCI మ్యాపింగ్ అయిందో లేదో చెక్ చేసుకోండి.
5.Account Transactions : మీ అకౌంట్ డబ్బు లావాదేవీలు జరుగుతూ ఉండాలి, అకౌంట్లో మీరు డబ్బులు వేస్తూ, తీస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు మీ అకౌంట్ active లో అప్పుడు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఆర్థిక సహాయం నేరుగా అకౌంట్లోకి వస్తాయి.
సూచన :
పైన చెప్పిన వివరాలు అన్నీ సరిగ్గ ఉండి, మీకు అకౌంట్లోకి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు పడక పోతే మీ స్థానిక గ్రామ – వార్డు సచివాలయం లో లేదా మండలి విద్యా శాఖ అధికారి (MEO) కార్యాలయానికి వెళ్ళి ఫిర్యాదు చేయవచ్చు.
తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఆర్థిక సాయం పొందాలంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఇవి తప్పనిసరి గా పాటించాల్సిందే.
తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఆర్థిక సహాయం పొందాలనుకునే విద్యార్థుల తల్లిదండ్రులు కొన్ని విషయాలు గమనించుకోవాలి, విద్యార్ది తల్లి బ్యాంక్ ఖాతాకు NPCI మ్యాపింగ్ అయ్యి ఉండాలి, అలాగే బ్యాంక్ ఖాతాకు ఆధార్ నెంబర్ కూడా లింక్ అయ్యి ఉండాలి, మొబైల్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలి, ఇదంతా సక్రమంగా ఉంటేనే విద్యార్ది తల్లి బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఆర్థిక సహాయం అకౌంట్లోకి వస్తాయని అధికారులు సూచిస్తున్నారు, కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు ఇవి తప్పనిసరి పాటించాలి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
* తల్లికి వందనం పథకం ఎవరికి వర్తిస్తుంది :
ప్రభుత్వ పాఠశాల, ఎయిడెడ్ మరియు ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు తల్లికి వందన పథకం వర్తిస్తుంది.
* ఒకే ఇంట్లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే అందరికీ డబ్బులు వస్తాయా?
ఒకే ఇంట్లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న ఎంత మంది విద్యార్థులు ఉంటే అంత మందికి తల్లికి వందనం పథకం వర్తిస్తుంది.
*తల్లికి వందనం పథకం కింద మొత్తం అందే ఆర్థిక సహాయం ఎంత? :
తల్లికి వందన పథకం కింద 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 000 కేటాయించడం జరిగింది, అందులో రూ.13,000 నేరుగా తల్లుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది, మిగత రూ.2,000 పాఠశాల మెయింటనెన్స్ కోసం పాఠశాలకు కేటాయించడం జరుగుతుంది.
*తల్లికి వందన పథకం ఆర్థిక సహాయం పొందాలంటే విద్యార్థులకు హాజరు శాతం ఎంత ఉండాలి :
తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు నేరుగా తల్లుల ఖాతాలో జమ కావాలంటే విద్యార్థులకు 75% హాజరు తప్పనిసరి అని గతంలో నిబంధన ఉండేది, ఈ విద్య సంవత్సరం హాజరు మినహాయింపులపై ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాల కోసం వేచి చూడాల్సివున్నది .
*తల్లికి వందనం అర్హుల జాబితా లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడం ఎలా? :
తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఆర్థిక సహాయం పొందే అర్హుల జాబితా లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే, ఈ పథకానికి సంబంధించిన అర్హుల జాబితా వచ్చిన తర్వాత గ్రామ – వార్డు సచివాలయలో ప్రదర్శిస్తారు.
*తల్లికి వందనం పథకం అర్హత లిస్ట్ ఆన్లైన్ లో ఎలా చెక్ చేసుకోవాలి :
అధికారిక వెబ్సైట్ నవశకం బెనిఫిషియరీ మేనేజ్మెంట్ పోర్టల్ ద్వారా లేదా మీ ఆధార్ కార్డ్ ఐడి ద్వారా ఆన్లైన్లో చెక్ చేసుకోండి.
ఆన్లైన్లో మీ ఆధార్ కార్డుతో తల్లికి వందనం పథకానికి సంబంధించిన మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ క్రింద లింక్ పై క్లిక్ చేయండి.
LINK : తల్లికి వందనం
*తల్లికి వందనం పథకానికి సంబంధించిన మీకు అర్హత ఉండి కూడా అర్హుల జాబితా లిస్ట్ లో మీ పేరు లేకపోతే ఎం చేయాలి? :
అర్హుల జాబితా లిస్ట్ లో మీ పేరు లేకపోతే అప్పుడు మీ అప్లికేషన్ లో ఏమైనా తప్పులు ఉండవచ్చు, అప్పుడు విద్యార్ది చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులను గానీ లేదా గ్రామ వార్డు సచివాలయంల విద్య అసిస్టెంట్‌ను సంప్రదించి డేటా ను అప్డేట్ చేయించుకోవాలి.
*పాఠశాలలకు ఇచ్చే ₹2,000 దేనికి ఉపయోగిస్తారు :
తల్లికి వందనం పథకం కింద పాఠశాలకు ఇచ్చే 2 వేల రూపాయలను క్లీనింగ్, మౌలికవసతుల కల్పన మరియు పాఠశాల మెయింటెనెన్స్ కోసం ఉపయోగిస్తారు.
ముగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సూపర్ సిక్స్ పథకాలలో తల్లికి వందనం పథకం ప్రత్యేకమైనది ఈ తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి ఇంట్లో చదువుకునే విద్యార్థులు ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే ప్రతి ఒక్క విద్యార్థికి జూలై 3వ వారంలో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది.














Leave a Reply