AP Polycet counselling 2026 : రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి? అవసరమైన డాక్యుమెంట్లు & పూర్తి గైడెన్స్

AP Polycet Counselling 2026: How to Register? Required Documents & Complete Guidance

AP Polycet counselling 2026 :

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న HLC సెంటర్లలో ఏపీ పాలిసెట్ మొదటి కౌన్సిలింగ్ 2026 జరుగుతుంది. HLC అంటే హెల్ప్ లైన్ సెంటర్లు అని అర్థం, పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు జూలై 4, 2026 వ తారీఖు లోపు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు వెబ్ ఆప్షన్ ప్రక్రియ పూర్తి చేయాలి.

కౌన్సిలింగ్ ముఖ్యమైన తేదీలు
వెబ్ ఆప్షన్ల గడువుజూన్ 29,2026 నుంచి జూలై 3,2026 వరకు
ఫీజు చెల్లింపు గడువు జూన్ 30,2026
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ గడువు జూలై 1, 2026
సీట్లు కేటాయింపు జూలై 6, 2026
క్లాసులు ప్రారంభం జూలై 7, 2026

రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి?

ఇంజినీరింగ్, నాన్ – ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఈ కౌన్సిలింగ్ ద్వారారిజిస్ట్రేషన్ ఎలా చేయాలి? తమకు నచ్చిన కాలేజీలను ఎంచుకోవచ్చు.

  • ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ ఏపీ పాలీసట్ కౌన్సిలింగ్ అధికారిక వెబ్సైట్ ద్వారా online లో జరుగుతుంది.
  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ పోర్టల్ ను సందర్శించి online Certificate Verification & Fee Payment అనే లింక్ పై క్లిక్ చేయాలి.
  • అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్ నెంబర్ మరియు ర్యాంక్ కార్డ్ మరియు ఆధార్ వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
  • ప్రాసెసింగ్ ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. BC/OC అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు రూ.700, SC/ST అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. అభ్యర్థులు ఈ ఫీజును UPI ద్వారా net బ్యాంకింగ్ ద్వారా మరియు డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా ఆన్లైన్ విధానంలో చెల్లించాలి.
  • ఆన్లైన్లో ధ్రువపత్రాల వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అభ్యర్థులు నేరుగా వెబ్ ఆప్షన్ల ప్రక్రియకు వెళ్ళవచ్చు.
  • సర్టిఫికెట్లో మార్పులు అవసరమైన వారు లేదా వెరిఫికేషన్ పూర్తి కాని వారు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్లలో అసలైన ధ్రువపత్రాలతో హాజరై వెరిఫికేషన్ పూర్తి చేయించుకోవాలి.

ముఖ్యమైన పత్రాలు

1.SSC మార్కుల మెమో లేదా తత్సమాన మార్కుల మెమో.

2.4 వ తరగతి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు.

3. ఏపీ పాలిసెట్ 2026 హాల్ టిక్కెట్.

5. ఆధార్ కార్డు.

4.మీకు వచ్చిన ర్యాంక్ కార్డ్.

6. కుల ధృవీకరణ పత్రం SC/ST)BC అభ్యర్థులకు.

7.EWS సర్టిఫికెట్ OC అభ్యర్థులకు 2026-27 విద్యా సంవత్సరానికి చెలుబాటు అయ్యేది ఉండాలి.

8. ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (TC).

9. తల్లిదండ్రుల ఆదాయ ధృవీకరణ పత్రం (జనవరి 1, 2023 తర్వాత జారీచేసినది మాత్రమే , ఫీజు రీయింబర్స్మెంట్ కోసం)

ధ్రువపత్రాల పరిశీలిన

  • అభ్యర్థులు ఫీజు చెల్లించిన తర్వాత ఆన్లైన్ ద్వారానే సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది.
  • ధ్రువపత్రాల పరిశీలిన తర్వాత అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు లాగిన్ ఐడి వస్తాయి.
  • ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులు (PH, NCC, Sports, CAP) తప్పనిసరిగా హెల్ప్ లైన్ కేంద్రాలకు స్వయంగా హాజరు కావాలి.

వెబ్ ఆప్షన్ల నమోదు

1. అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీలను మరియు కోర్సులును జూన్ 29, 2026 నుంచి జూలై 3, 2026 వరకు ఆన్లైన్లో ఎంచుకోవాలి.

2..వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ పూర్తయిన తరువాత అభ్యర్థులు జూలై 4, 2026 న మాత్రమే మార్పులు చేర్పులు చేసే అవకాశం కూడా ఉంటుంది.

సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది?

  • అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీలను మరియు బ్రాంచీలను ఒక ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవాలి.
  • ఆప్షన్లను ఎక్కువ సంఖ్యలో ఇవ్వడం ద్వారా సీటు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని అధికారలు సూచిస్తున్నారు.
  • ఏపీ పాలిసెట్ అభ్యర్థుల ర్యాంక్ కార్డ్, రిజర్వేషన్ క్యాటగిరి ఎంపిక చేసుకున్న ఆప్షన్ల ఆధారంగా సీటును కేటాయిస్తారు.
  • సీటును కేటాయించిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ను డౌన్లోడ్ చేసుకోవాలి.
  • ఏపీ పాలీసెట్ కౌన్సిలింగ్ లో సీటు పొందిన అభ్యర్థులు జూలై 7, 2026 నుండి జూలై 10, 2026 తేదీ లోపు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు సంబంధిత కాలేజీలలో నేరుగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
  • ఆ తర్వాత మీకు కేటాయించిన కాలేజీలలో ప్రత్యక్షంగా హాజరై అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
  • మొదటి విడతలో అడ్మిషన్లు పొందిన అభ్యర్థులకు july 7, 2026 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి.

ఏవైనా సందేహాలు ఉంటే

విద్యార్థులకు ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురైనా మొబైల్ నెంబర్ మార్చాలనుకున్న సమీపంలో ఉన్న హెల్ప్ లైన్ కేంద్రాన్ని సంప్రదించవచ్చు కన్వీనర్ కార్యాలయానికి సంబంధించిన ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వటం జరిగింది Email ID = chepolycet@gmail.com ఈ ఈమెయిల్ ఐడీ ద్వారా కూడా కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. అత్యవసర సమాచారం లేదా ఏదైనా సందేహాల కోసం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు 7842095469, 7842085469, 7842075469 ఈ హెల్ప్ లైన్ నెంబర్లతో అధికారులను కాంటాక్ట్ అవ్వచ్చు

FAQ

1. ఏపీ పాలీసట్ కౌన్సిలింగ్ 2026 ఎప్పుడు ప్రారంభమైంది?

ANS : జూన్ 24 నుంచి

2. ఏ డాక్యుమెంట్లు తప్పనిసరి?

ANS : హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, టెన్త్ క్లాస్ మార్క్ మెమో, స్టడీ సర్టిఫికెట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు మొదలేనివి ముఖ్యమైన పత్రాలు.

3. వెబ్ ఆప్షన్లు ఎప్పుడు ఇవ్వాలి?

ANS : జూన్ 29, 2026 నుంచి జులై 3, 2026 వరకు.

4. కౌన్సిలింగ్ ఫీజు ఎంత?

ANS : BC/OC అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు రూ.700, SC/ST అభ్యర్థులు రూ.250 చెల్లించాలి.

5. సీట్ అలాట్మెంట్ ఫలితాలు ఎప్పుడు వస్తాయి?

ANS : సీట్లు కేటాయింపు పై ప్రకటన జూలై 6 వ తేదీన అధికారులు విడుదల చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *