E20 Petrol Explained : ఇంజిన్ పై ప్రభావం, మైలేజ్ ప్రయోజనాలు, కేంద్రం క్లారిటీ
దేశమంతటా E20 పెట్రోల్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక ఫ్యాక్ట్ షీట్ విడుదల చేసింది, E20 పెట్రోల్ వాడితే ఇంజిన్ దెబ్బతింటుందా? లేదా మైలేజ్ తగ్గుతుందా? పాత బైకులు, కార్లు ఈ పట్రోల్ వాడితే సురక్షితమేనా? ఇథనాల్ పెట్రోల్ వాసనకు కీటకాలు ఆకర్షితమవుతాయని, వస్తున్న సందేహాలకు ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వడం జరిగింది. కాబట్టి జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. కాబట్టి వినియోగదారులు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఇవే.
E20 పెట్రోల్ అంటే ఏమిటి?
E20 పెట్రోల్ అంటే, ఇథనాల్ 20 శాతం మరియు పెట్రోల్ 80 శాతం కల్పిన ఇంధనం. దిగుమతి అయ్యే క్రూడ్ ఆయిల్ పై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించడం మరియు రైతులకు ఇథనాల్ ఉత్పత్తి ద్వారా ఆదాయాన్ని పెంచడం దీని యొక్క ప్రధాన లక్ష్యం.
E20 పెట్రోల్ వాడకం వల్ల ద్విచక్ర వాహనాల్లో కార్బన్ మోనాక్సైడ్ ఉద్గారాలు 50% నాలుగు చక్రాల వాహనాల్లో 30% వరకు తగ్గుతాయని కేంద్ర పెట్రోలియం సహజ వనరుల శాఖ మంత్రిత్వపు వెల్లడించింది. 20% ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వినియోగంపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం పై కేంద్రం పెట్రోలియం సహజ వనరుల మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆ ప్రచారం కేవలం తప్పుడు ప్రచారం మాత్రమేనని దీనిని ఎవరు నమ్మవద్దని కేంద్ర పెట్రోలియం సహజ వనరుల మంత్రిత్వ శాఖ ఖండించింది.
కేంద్ర ప్రభుత్వం ఏమి చెప్పింది?
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం
- సాధారణ వినియోగంలో ఇంజిన్ కు నష్టం జరుగుతుందని నిర్ధారించే ఆధారాలు ఏమీ లేవు.
- E20 పెట్రోల్ ను E20-Comapatible వాహనాల్లో సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు.
- పాత మోడల్ వాహనాల్లో ఒకసారి ఉపయోగించే ముందు యజమాని మాన్యువల్ ను పరిశీలించడం మంచిది.
- చివరిగా వాహన తయారీదారు సూచనలను పాటించడం తప్పనిసరి.
E20 పెట్రోల్ వల్ల మైలేజ్ తగ్గుతుందా?
E20 పెట్రోల్ వాడటం వల్ల వాహనాల ఇంజిన్లు దెబ్బతింటాయని మైలేజ్ తగ్గుతుందని వస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా వాహనాలకు వారంటీ వర్తించదని ఇన్సూరెన్స్ కూడా వర్తించదని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) ఇండియన్ ఆయిల్, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (SIAM) వంటి ప్రముఖ సంస్థలు నిర్వహించిన సాంకేతిక అధ్యయనాలకు ఈ ఆరోపణలు అన్ని విరుద్ధంగా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం సహజ వనరుల మంత్రిత్వ శాఖ వివరించింది.
E20 పెట్రోల్ వల్ల కలిగే ప్రయోజనాలు
E20 పెట్రోల్ వాడటం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయని కేంద్ర పెట్రోలియం సహజ వనరుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
- ద్విచక్ర వాహనాల్లో కార్బన్ మోనాక్సైడ్ ఉద్గారాలు 50% నాలుగు చక్రాల వాహనాల్లో 30% వరకు తగ్గుతాయని వెల్లడించింది.
- విదేశీ చమురు దిగుమతులు తగ్గుతాయి.
- ముఖ్యంగా E20 పెట్రోల్ కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
- రైతుల నుంచి ఇథనాల్ కొనుగోలు చేయడం ద్వారా రైతులకు ఆర్థిక మద్దతు ఇచ్చినట్లు ఉంటుంది.
- దేశ ఇంధన భద్రతకు తోడ్పడుతుంది.
- కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగంగా ఇథనాల్ బ్లైండింగ్ కార్యక్రమాన్ని చేస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం సహజ వండరుల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
- ఫ్యూయల్ – గ్రేడ్ ఇథనాల్ తయారీలో చక్కెర అవశేషాలు ఉండవని కాబట్టి కీటకాలు ఆకర్షితమవుతాయనే వాదనలో ఎలాంటి నిజం లేదని కేంద్రం కొట్టిపారేసింది.
E20 పెట్రోల్ పై కేంద్రం క్లారిటీ
ముడి చమురు ధరలు నాటినాటికి పెరుగుతూ ఉండటం, ఇంధన ధరల భారాన్ని తగ్గించాలన్న లక్ష్యం తో కేంద్ర ప్రభుత్వం E20 పెట్రోల్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. పెట్రోలలో ఎక్కువ శాతం ఇథనాల్ కలిపిన ఇంధనాలపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 22% నుంచి 30% వరకు ఇథనాల్ మిశ్రమం కల్గిన E22,E25,E27,E30 రకాల పెట్రోలకు ఈ మినహాయింపు వర్తించనుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎక్కువ ఇథనాల్ మిశ్రమ ఇంధనాల వినియోగానికి మరింత ప్రోత్సాహం లభించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇటివల IS 19850-2026 కింద E22,E25,E27,E30 పెట్రోల్ మిశ్రమాలకు సంబంధించిన ఇంధన నాణ్యత ప్రమాణాలను బ్యూరో ఆఫ్ ఇండియాన్ స్టాండర్డ్స్ (BIS ) అధికారికంగా ప్రకటించింది.
FAQ
1. పాత వాహనాలలో E20 వాడవచ్చా?
Ans : వాహన తయారీదారు సూచనలను పాటించి వాడటం మంచిది.
2.E20 పెట్రోల్ వల్ల ప్రయోజనం ఏమిటి?
Ans : కాలుష్యం తగ్గించడం, విదేశీ దిగుమతులను తగ్గించడం, రైతులకు ఆర్థికంగా తోడ్పడటం.
3. E20 ఎక్కడ లభిస్తుంది?
Ans : E20 సరఫరా చేస్తున్న పెట్రోల్ బంకులలో దొరుకుతుంది.
4. కేంద్ర ప్రభుత్వం ఏమి చెప్పింది?
Ans : E20 పెట్రోల్ వాడటం వల్ల వాహనాల ఇంజిన్లు దెబ్బతింటాయని మైలేజ్ తగ్గుతుందని వస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
5.E20 పెట్రోల్ అంటే ఏమిటి?
Ans : E20 పెట్రోల్ అంటే, ఇథనాల్ 20 శాతం మరియు పెట్రోల్ 80 శాతం కల్పిన ఇంధనం.




Leave a Reply