NEET, JEE అడ్మిషన్స్ 2026 : విద్యార్థులకు బిగ్ అలర్ట్, నీట్, జేఈఈ అడ్మిషన్లలో కొత్త రూల్స్? మార్కుల వెయిటేజ్ పై కేంద్ర ప్రభుత్వం కీలక అప్డేట్?

NEET, JEE Admissions 2026: Big Alert for Students, New Rules in NEET, JEE Admissions? Central Government's Key Update on Mark Weightage?

NEET, JEE అడ్మిషన్స్ 2026 లో మార్కుల వెయిటేజ్ పై కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉన్న ప్రతిపాదనలు ఏమిటి?

ప్రస్తుతం విద్యా విధానములో నూతన సంస్కరణలు దిశగా కేంద్రం ప్రభుత్వం అడుగులు వేస్తుంది, నీట్ లో చోటు చేసుకున్న పేపర్ లీకేజీల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెయిటేజ్ మార్కుల విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు జాతీయస్థాయిలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య జరిగిన సంఘటనలు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది విద్యార్థులు, తల్లిదండ్రులలో పరీక్ష వ్యవస్థ విశ్వసనీయతపై తీవ్ర చర్చకు దారితీసాయి. ప్రస్తుతం భారతదేశంలో పోటి పరీక్షల తీరుతెన్నులపై విమర్శలు వెలుగుతున్నాయి. ఇకపై భవిష్యత్తులో పేపర్ లీకేజ్ సంఘటన జరగకుండా కేంద్ర ప్రభుత్వం గట్టిగానే చర్యలు చేపడుతుంది. జేఈఈ పరీక్షలకు జాతి స్థాయిలో ఉంటున్న భారీ పోటీని నివారించడంతోపాటు అక్రమాలకు చెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేయబోతుంది.

ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం నీట్, జేఈఈ అడ్మిషన్లలో వెయిటేజ్ ఇవ్వాలని భావిస్తుంది, రానున్న బోర్డు పరీక్షలకు 50% వెయిటేజ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కనబడుతుంది. వైద్య, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలైన లేదా మరి ఏ బోర్డు పరీక్షలు అయిన ఉండే అధిక ప్రాధాన్యతను తగ్గించాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తున్నట్లు జాతి స్థాయిలో వార్తలు వినిపిస్తున్నాయి.

నకిలీ పాఠశాలలకు, కోచింగ్ సెంటర్లకు కేంద్రం ప్రభుత్వం చెక్

1.ప్రస్తుతం వైద్య, ఇంజినీరింగ్ విద్యార్థులు చేరే ప్రవేశాలను, ప్రవేశ పరీక్ష స్కోర్ల ఆధారంగా జరుగుతున్నాయి.

2.ఇక పై ఆయా ప్రవేశ పరీక్షలకు అర్హత సాధించాలంటే, అభ్యర్థులు బోర్డ్ పరీక్షలో అర్హత శాతాన్ని సాధించాల్సి ఉంటుంది.ప్రవేశాలు

3. ప్రవేశాలు/మెరిట్ లో బోర్డు పరీక్షలకు 50 శాతం వెయిటేజ్ ఇవ్వటం, కోచింగ్ సెంటర్ల పై ఆధారపడడాన్ని తగ్గించటం.

4. ప్రవేశ పరీక్షలకు పాఠశాల సిలబస్ కు మరింత దగ్గరగా అనుసంధానించటం, పలు మార్లు ప్రయత్నించే అవకాశాలు కల్పించడం.

5. రాబోయే రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని కంప్యూటర్ ఆధారిత అడాప్టివ్ ఆన్ – డిమాండ్ పరీక్షల వైపు మళ్ళడం వంటి మార్పులకు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి.

6. అభ్యర్థులు అధికార ప్రకటన కోసం వేచి చూడాలి.

7. Aదే విధంగా విద్యార్థులు కోచింగ్ పై ఆధారపడటం, డమ్మీ పాఠశాలల వ్యాప్తిని అరికట్టడం.

8. పరీక్షలలో నిష్పక్షపాతాన్ని పరిశీలించడానికి, గత సంవత్సరం విద్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన 9 మంది సభ్యుల కమిటీ ఈ సంస్కరణలను పరిశీలిస్తుంది.కమిటీ

9. కమిటీ ఇచే తుది నివేదిక త్వరలో కేంద్ర ప్రభుత్వానికి అందించబోతుంది. కమిటీ సిఫార్సు మేరకు ప్రవేశ పరీక్షలను పాఠశాల సిలబస్ కు దగ్గరగా అనుసంధానం చేయాలని చెప్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గతంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ వంటి ప్రవేశ పరీక్షలలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటర్ మార్కులకు వెయిటేజ్ ఇచ్చేవి, మన రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ విధానాన్ని 2023 లో రద్దు చేశాయి, మళ్లీ ఇన్నాళ్లకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తీసుకురావటం చర్చనీయాంశంగా మారింది.

గమనిక

మార్కుల వెయిటేజ్ అనేది పరిశీలనలో ఉన్నది, కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *