DigiLocker లో కొత్త ఫీచర్ : ఇప్పుడు family ID & ఇతర ప్రభుత్వ డాక్యుమెంట్లు సులభంగా యాక్సెస్ చేయవచ్చు & పూర్తి వివరాలు

New feature in DigiLocker: Now family ID & other government documents can be easily accessed & full details

DigiLocker లో కొత్త ఫీచర్ ఏమిటి?

DigiLocker లో కొత్తగా వచ్చిన ఫీచర్ Family ID ప్రభుత్వ పత్రాలను నేరుగా మొబైల్ నుంచి పొందవచ్చు ఉదాహరణకు ఆదాయ కుల ధ్రువీకరణ పత్రాలు మొదలైనవి, మీ రాష్ట్ర ప్రభుత్వలకు ఈ ID లను డిజిటల్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవడం మరియు భద్రపరచుకోవడం మరియు షేర్ చేయడం లాంటివి చేయవచ్చు.

Family ID నీ DigiLocker లో ఎలా పొందాలి?

డిజిలాకర్ లోకి ఫ్యామిలీ ఐడి ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది పద్ధతులను పాటించాలి.

  • డిజి లాకర్ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి లేదంటే డిజి లాకర్ మొబైల్ యాప్ ఓపెన్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ తో లేదా ఆధార్ కార్డు నెంబర్ తో లాగిన్ అవ్వండి.
  • అక్కడ ఒక సెర్చ్ బార్ ఉంటుంది ఆ సెర్చ్ బార్ లో మీ రాష్ట్రానికి సంబంధించిన ఫ్యామిలీ ఐడి ఉదాహరణకు రాజస్థాన్ అయితే జెన్ ఆధార్ రాజస్థాన్ అని లేదంటే మధ్యప్రదేశ్ అయితే సమగ్ర మధ్యప్రదేశ్ అని టైప్ చేయాలి.
  • సంబంధిత వివరాలను లేదా మీ Family ID ఎంటర్ చేసి డేటా తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలి.
  • తర్వాత “Fetch” అనే బటన్ క్లిక్ చేయడంతో మీ ఫ్యామిలీ ఐడి మీ డీజి లాకర్ అకౌంట్ లోని ‘issued documents’ విభాగంలో శాశ్వతంగా సేవ్ అయ్యి ఉంటుంది.

Family ID వల్ల కలిగే ప్రయోజనాలు?

కాగిత రహిత డాక్యుమెంట్ :

కాగిత రహిత పత్రాలను ప్రోత్సహించాలని ఉద్దేశంతో భారత ప్రభుత్వం చొరవతో DigiLocker ఏర్పాటు చేయబడింది. భవిష్యత్తు కోసం కాగితాన్ని ఆదా చేయటానికి డిజిలాకర్ఉ పయోగపడుతుంది, మీరు మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఈ డీజీ లాకర్ లో చేసిన ప్రతి ఒక్క డాక్యుమెంట్సు సురక్షితంగా అప్లోడ్ చేయవచ్చు.

పత్రాల భద్రతా :

DigiLocker పత్రాలకు పూర్తి భద్రత కల్పిస్తుంది. మీ పత్రాల భద్రతా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ పత్రాలు మీకు కావాల్సి వచ్చినప్పుడు మీరు యాక్సెస్ చేసుకోవచ్చు, మీరు పత్రాలను జారీ చేయడానికి మీరు అందించే మొత్తం సమాచారం ఎన్క్రిప్ట్ చేయబడుతుంది తద్వారా వ్యక్తిగత సమాచారం సురక్షితంగా భద్రంగా ఉంటుంది.

సురక్షిత సంతకం :

మీ ఎలక్ట్రానిక్ పత్రాలపై ఆన్లైన్లో డిజిటల్ గా సంతకం చేయడానికి ఒక ప్రక్రియ ఈ సంతకం అనేది ఒక డిజిటల్ సంతకం మీ ఆధార్ నెంబర్ మరియు డిజిటల్ సంతకాలు ఒక దానికి ఒకటి అనుసంధానించబడతాయి.

మోసం జరిగే ప్రమాదం తక్కువ :

ప్రభుత్వ సంస్థలు ధ్రువీకరణ కోసం మీ నుండి చట్టపరమైన పత్రాలను అడిగితే మీరు తప్పనిసరిగా నాకార నెంబర్ను అందించాలి ఆ నెంబర్ పొందిన తర్వాత ఈ సంస్థలు మీ గుర్తింపును త్వరగా ధ్రువీకరిస్తాయి ఈ సందర్భాలలో అసలు పత్రాలను నీ వెంట తీసుకు వెళ్ళడానికి ఇది నివారిస్తుంది మరియు పత్రాలను పోగొట్టుకున్న ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

త్వరితగతిన పూర్తి చేయటం :

పాన్ కార్డులు, ఆధార్ కార్డులు లేదా ఇతర పత్రాలు ఆన్లైన్లో మరింత వేగంగా పూర్తవుతాయి ఇది పూర్తి డిజిటల్ ప్రక్రియ, మీ ప్రత్యేకమైన డీజీ లాకర్ నెంబర్ మరియు ఆధార్ కైవైసి ద్వారా వాటిపై ఇ-సంతకం చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

. అంశం. వివరాలు
లక్ష్యం కాగిత రహిత పాలనను ప్రోత్సహించటం, పత్రాలను భౌతికంగా తీసుకెళ్లే ఇబ్బందులను తగ్గించటం.
అధికారిక సంస్థఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఉచిత స్టోరేజ్ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి 1gb క్లౌడ్ స్టోరేజ్ ఇవ్వడం జరుగుతుంది.
భద్రతఆధార్ నెంబర్ మరియు ఓటీపీ మరియు టు – ఫ్యాక్టర్ అధెంటికేషన్ భద్రతతో డిజి లాకర్ పనిచేస్తుంది.
ప్రామాణికతDigiLocker లో జారీ చేయబడిన పత్రాలు అసలు భౌతిక పత్రాలతో సమానంగా చట్టబద్ధమైనవి.
డాక్యుమెంట్స్ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ రేషన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ మరియు టెన్త్ / ఇంటర్ మార్కుల మెమొలు మొదలైనవి డిజిలాకర్లో నిలవ చేసుకోవచ్చు.
ఎలా వాడాలి?అధికారిక వెబ్సైట్ డిజిలాకర్ ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా ఖాతాను సృష్టించుకుని డిజిలాకర్ను ఉపయోగించుకోవచ్చు.

DigiLocker లో డాక్యుమెంట్లు అప్లోడ్ చేయడం ఎలా?

డిజిలాకర్ లో పత్రాలను అప్లోడ్ చేయడం చాలా సులభమైన ప్రక్రియ.

1.ఒకసారి మీరు డిజిలాకర్ లో సైన్ అప్ తరువాత అప్లోడ్ డాక్యుమెంట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

2.ఒకసారి మీరు అప్లోడ్ డాక్యుమెంట్ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు లొకేషన్ ఎంచుకొని, మీరు అప్లోడ్ చేయవలసిన ఫైల్స్ ను సెలెక్ట్ చేసుకోవాలి.

3. మీరు ఫైల్స్ ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత open అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. మీరు ఒకేసారి అనేక రకమైన డాక్యుమెంట్లను ఎంచుకోవచ్చు.

4. మీరు అప్లోడ్ చేసిన పత్రాల జాబితాలో ఏదైనా డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ రకాన్ని ఎంచుకొని దానిపై క్లిక్ చేయండి. అప్పుడు మీరు ఒక డ్రాప్ డౌన్ బాక్స్ కనపడుతుంది, అప్పుడు మీరు దాంట్లో మీకు కావల్సిన డాక్యుమెంట్ రకాన్ని ఎంచుకోవచ్చు, ఐతే మీరు ముందుగ నిర్వహించిన డాక్యుమెంట్ రకంతో సరిపోలకపోతే, అప్పుడు మీరు తప్పనిసరిగా డ్రాప్ – డౌన్ మెనూలోని Others అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి.

5.ఆ తర్వాత “save” అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి, అప్పుడు సిస్టమ్ మీ డాక్యుమెంట్ రకాన్ని అప్డేట్ చేస్తుంది.

DigiLocker ఎవరు ఉపయోగించుకోవచ్చు?

  • ఆధార్ కార్డ్ మరియు చెల్లుబాటు అయ్యే మొబైల్ నెంబర్ ఉండి, భారత దేశంలో ఉన్న ప్రతి యొక్క సాధారణ పౌరుడు DigiLocker ను ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి వారి ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్ పాలు ఇతరత్రా డాక్యుమెంట్ లు digiLocker లో భద్రపరచుకోవచ్చు.
  • విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్లు మరియు ID కార్డ్స్ మార్క్ లిస్టులు, విద్యార్థులకు సంబంధించిన ఏదైనా యాక్సెస్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు.
  • డ్రైవర్లు, వాహనదారులైతే వారి డ్రైవింగ్ లైసెన్సులు మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు RC బుక్ లాంటివి డిజిలాకర్ లో భద్రపరుచుకోవచ్చు.
  • భారతీయ IT Act ప్రకారం DigiLocker లోని పత్రాలు అసలైన భౌతిక పత్రాలతో సమానమైన చట్టపరమైన హోదాను కలిగి ఉంటాయి.
  • డిజి లాకర్లో ప్రతి ఆధార్ నెంబర్ కి 1GB క్లౌడ్ స్టోరేజ్ ఇవ్వడం జరుగుతుంది.

DigiLocker ఉపయోగించే సమయంలో గమనించాల్సిన విషయాలు :

1. సెక్యూరిటీ పిన్ : ఆధార్ తో మొబైల్ నెంబర్ ఖచ్చితంగా లింక్ అయ్యి ఉండాలి, డిజిలాకర్ ఖాతా సృష్టించాలన్న లేదా login అవ్వాలన్న ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ తప్పనిసరి ఎందుకంటే login చేసేటప్పుడు otp వస్తుంది కాబట్టి.

2. డిజిలాకర్ లో పత్రాలు భౌతిక పత్రాలతో సమానంగా గుర్తించ బడతాయి.

3. మీరు మొబైల్ లేదా కంప్యూటర్ నుంచి అప్లోడ్ చేసిన పత్రాలు, కొన్ని అధికారిక తనిఖీలలో ప్రభుత్వం విభాగాలు జారీ చేసిన పత్రాలను మాత్రమే ప్రామాణికంగా పరిగణిస్తారు.

4. DigiLocker లో ఖాతా భద్రత కోసం 6 అంకెల సెక్యూరిటీ పిన్ ను సెట్ చేసుకోవాలి.

5. మీరు డిజిలాకర్ లో పత్రాలను సురక్షితంగా ఎలా నిల్వచేసుకోవాలో, ఎలా అప్లోడ్ చేసుకోవాలో మరింత సమాచారం కోసం డిజిలాకర్ యూజర్ మాన్యువల్ పరిశీలించవచ్చు.

FAQ

1.డిజిలాకర్ అంటే ఏమిటి?

Ans : భారత ప్రభుత్వం ఇచ్చే నిర్వహించబడుతున్న ఈ డీజిలాకర్ ను భారతదేశంలో ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రత్యేక పౌరుడు ఉపయోగించుకోవచ్చు, ప్రతి పౌరుడు పాన్ కార్డు, ఓటర్ కార్డ్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, విద్యార్థులు వాళ్ళ విద్య పత్రాలు ముఖ్యమైన మంత్రాలు ఉంటే వాటిని డిజిటల్ రూపంలో దాచుకోవడానికి టీజీ లాకర్ ఉపయోగపడుతుంది, డీజిలాకర్ ని డీజిల్ లాకర్ వెబ్సైట్ ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.

2.డిజిలాకర్ లో పత్రాలు భద్రంగా ఉంటాయి?

Ans : డిజిలాకర్ ఇది చాలా సురక్షితమైనది, లాకర్ భద్రత కోసం ఎన్క్రిప్షన్ మరియు టు – ఫ్యాక్టర్ అధెంటిఫికేషన్ విధానాలను ఉపయోగిస్తుంది.

3.డిజిలాకర్లో ఎంత స్టోరేజ్ లభిస్తుంది?

Ans : ఆధార్ కార్డ్ కలికి ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి 1GB క్లౌడ్ స్టోరేజ్ ఇవ్వడం జరుగుతుంది.

4.డిజిలాకర్ లో నా సొంత పత్రాలను అప్లోడ్ చేయవచ్చా?

Ans : అవును అప్లోడ్ చేసుకోవచ్చు, డీజిలాకర్లో pdf లేదా ఇతర ఫార్మాట్ లో ఉన్న సొంత పత్రాలను “Uploaded Documents” విభాగంలో అప్లోడ్ చేసుకోవచ్చు ఉదాహరణకు (డిగ్రీ సర్టిఫికెట్లు టెన్త్ ఇంటర్ మార్ట్ మెమోలు )

5.డిజిలాకర్లో ఆధార్ ను ఎలా లింకు చేయాలి?

మీరు డీజీ లాకర్ వెబ్సైట్ ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా లాగిన్ అయిన తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ వచ్చే otp ఎంటర్ చేయడం ద్వారా ఆధార్ కార్డు ను జత చేయవచ్చు

6.మొబైల్ నెంబర్ మారితే కొత్త ఖాతా సృష్టించవచ్చా?

మొబైల్ నెంబర్ మారితే ముందుగా ఆధార్ లో కొత్త మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని, తర్వాత డిజిలాకర్ ఖాతాలో ఆ నెంబర్ తో లాగిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *